Telangana: 59 ఉపకులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ 8 d ago

TG: రాష్ట్రంలో SC వర్గీకరణ ఏప్రిల్ 14 నుంచి అమలు వచ్చింది. 30 ఏళ్లపాటు SC వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకువస్తూ నిబంధనలు, ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తర్వుల తొలికాపీని అందజేయాలని SC వర్గీకరణపై ఏర్పాట చేసిన మంత్రివర్గ ఉపసంఘం తుది సమీక్షలో నిర్ణయించింది. ఏప్రిల్ 13న హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్ క్షితిజ, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
వర్గీకరణ అమలు చేస్తున్న తొలిరాష్ట్రం...
"సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ దశాబ్దాల నాటి డిమాండ్ నెరవేర్చింది. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలను ఆమోదించినా, చట్టపరమైన మద్దతుతో అమలు కాలేదు. రాష్ట్రంలో SC వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. మార్చి 18న ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గవర్నర్ బిల్లుకు ఆమోదం పొందింది. వర్గీకరణ ఉత్తర్వులు, విధివిధానాలు ఏప్రిల్ 14న జారీ చేశాయి. GO మొదటికాపీని సీఎం రేవంత్ కు దజేయాలని కమిటీ నిర్ణయించింది.
సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలు..
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలను కమిటీ సమీక్షించి, GO జారీ చేయడానికి ఆమోదం పొందింది. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్టోబరులో ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్య ప్రవేశాలు, ఉపాధి, ఉద్యోగ, ఆర్ధిక సహాయం, రాజకీయ భాగస్వామ్యంపై కమిషన్ లోతైన విశ్లేషణ జరిగిచింది.
2026 జనాభా లెక్కలు.. ఎస్సీ రిజర్వేషన్లు పెంపు..
2026 జనాభా లెక్కల ప్రకారం... రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తారు. ఇప్పుడు 2011 రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తెలంగాణలో జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15 శాతం ఎస్సీ జనాభా 17.5 శాతానికి పెరిగింది. జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన అనంతరం ఆ మేరకు చర్యలు తీసుకుంటారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్ ప్రవేశ పెట్టాలన్న కమిషన్ సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించింది.
199 పేజీలతో నివేదిక..
వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్షర్ కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. దీనిలో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. 2024 నవంబరు 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ 82 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. బహిరంగ విచారణలు, పర్యటనల్లో ప్రజల నుంచి వచ్చిన 4,750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో ఇచ్చిన 8,681 వినతులను పరిశీలించింది. కాగా, మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్-1, మధ్యస్త లబ్ధిపొందిన కులాలను గ్రూప్-2, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్-3లో సమకూర్చింది.
3 కేటగిరీలుగా విభజన..
గ్రూప్-1, 2, 3 మూడింట్లోనూ సరైన సభ్యులు లేకపోతే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతోంది. SC అభ్యర్థులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఎస్సీల్లో మొదటి రోస్టర్ పాయింట్ గ్రూప్-2కు.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు కీలకం. SC, ST, BC, EWS, దివ్యాంగుల రిజర్వేషన్ శాతాల ప్రకారం జరుగుతాయి. ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏక సభ్య కమిషన్.. రోస్టర్ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించి, ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది.
దీని ప్రకారం.. గ్రూప్- 1కు ఒకటి, గ్రూప్-2కు తొమ్మిది, గ్రూప్-3కు ఐదు రోస్టర్ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో 100 పాయింట్ల రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్-2లోని కులాలకు దక్కనుంది. రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్-1లోని కులాలకు అందనుంది. గ్రూప్-2లోని కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉండటంతో.. మూడో రోస్టర్ పాయింట్ గ్రూప్ -2 కులాలకు నాలుగో రోస్టర్ పాయింట్ గ్రూప్-3లోని కులాలకు లభించనుంది. గ్రూప్-1: 7, గ్రూప్-2: 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూప్-3: 22,41,62, 77, 91 మొత్తం రోస్టర్ పాయింట్లలో ఎస్సీలోని గ్రూపులకు దక్కేవి.